మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం దేవరయాంజాల్‌లోని మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. సకల జనుల దీక్షలో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద ఆర్టీసీ కార్మికులపై పోలీసులు చేసిన లాఠీఛార్జికి నిరసనగా ఈటల ఇంటికి వచ్చారు.
ఈటల ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - ఈటల ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా
ట్యాంక్‌బండ్‌పై పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ.. కార్మికులు ఇవాళ అధికార పార్టీ నేతల ఇళ్ల ముట్టడి చేపట్టారు. తమ గోడు వినాలంటూ వినతిపత్రాలు అందజేశారు.
ఈటల ఇంటి ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా
హకీంపేట్, మేడ్చల్ డిపో కార్మికులు మంత్రి నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనతో ఈటల బయటకు వచ్చారు. ఆయనకు వినతిపత్రం అందించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్తానని వారికి హామీ తెలిపారు.
ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?