మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర హిల్స్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోకి చొరబడి రూ. 95 వేల నగదు, 50 తులాల బంగారాన్ని అపహరించారు.
తాళం వేసిన ఇంట్లో 50 తులాల బంగారం చోరీ - తాళం వేసిన ఇంట్లోంచి 50 తులాల బంగారం చోరీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాఘవేంద్ర హిల్స్ కాలనీలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి రూ. 95 వేల నగదు, 50 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇంట్లోంచి 50 తులాల బంగారం చోరీ
బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు దొంగలు ఎత్తుకుపోయినట్లు గుర్తించి బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.