తెలంగాణ

telangana

ETV Bharat / state

"స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటో దిగిన తెరాస నేతపై కేసు"

స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటో దిగిన తెరాస నేత పై మేడ్చల్‌ జిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్.చంద్రశేఖర్ ఫిర్యాదుతో వెంకటేష్ పై క్రైమ్ నెం 149/2019, అండర్ సెక్షన్ 447, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

"స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటో దిగిన తెరాస నేతపై కేసు"

By

Published : Apr 13, 2019, 7:52 PM IST

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లో తెరాస నేత ఫొటో దిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్.చంద్రశేఖర్ ఫిర్యాదుతో వెంకటేష్ పై క్రైమ్ నెం 149/2019, అండర్ సెక్షన్ 447, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అత్యంత నిఘా ఉండే గదుల్లో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పెట్టడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది...
మేడ్చల్‌ జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలోని హోలీమేరి కళాశాల (లెక్కింపు కేంద్రం)లో మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల ఈవీఎంలను భద్రపరిచారు. కంటోన్మెంట్‌కు సంబంధించిన సామగ్రి భద్రపరిచిన గదిలో కీసరకు చెందిన తెరాస నేత వెంకటేష్‌ గురువారం అర్ధరాత్రి ఫొటో దిగాడు.
స్ట్రాంగ్‌ రూంలో ఫొటోలు, వీడియోలు నిషేదం...
ఇక్కడ భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించేందుకు అధికారులు వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు, నాయకులను ఆహ్వానించిన సందర్భంలో అతడు ఫొటో దిగినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూంలో ఫొటోలు దిగడం, వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details