ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల తప్పిదాల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విద్యార్థిసంఘం నాయకులు గళమెత్తారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ చౌరస్తా నుంచి కాప్రా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ, విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు.
విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ర్యాలీ - ecil
ఇంటర్‌బోర్డు అవకతవకల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఈసీఐఎల్ చౌరస్తా నుంచి కాప్రా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.
students-rally