కాంక్రీట్ నగరంలో మరో అద్భుత కళాసౌధం అందుబాటులోకి రానుంది. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు నగర శివార్లలోని ఉప్పల్‌లో మూసీ ఒడ్డున నిర్మితమైన శిల్పారామం ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే హస్తకళా ప్రావీణ్యులు దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
అందుబాటులోకి మరో కళాసౌధం
రాష్ట్ర రాజధాని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు మరో కళాసౌధం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మాదాపూర్‌లోని శిల్పారామంతో పాటు నగర శివార్లలో మరో మినీ శిల్పారామం నిర్మితమైంది. ఉప్పల్‌లోని మూసీ నది ఒడ్డున నిర్మించిన ఈ కళాసౌధం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
మానవుడి చేతిలో ప్రకృతి జీవం పోసుకుందా అన్నట్లుగా ఉప్పల్‌లో నిర్మితమైన శిల్పారామం మనసును మాయ చేస్తుంది. ప్రకృతి సౌందర్యం, పల్లె సంస్కృతి ఉట్టిపడేలా సుందరంగా తీర్చిదిద్దారు. ఉప్పల్ భగాయత్‌లో హెచ్‌ఎండీఏ లే అవుట్ పక్కన మూసీ లే అవుట్‌కు మధ్యలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇప్పటికే అర్హలకు స్టాల్స్‌ను కూడా కేటాయించారు. త్వరలోనే శిల్పారామం ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కొత్త ఇళ్లకు ముహూర్తం ఖరారు