మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం కొంపల్లిలో నిర్వహించనున్న తెరాస కార్యకర్తల సమావేశానికి నాయకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేక్, కృష్ణారావు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సర్వం సిద్ధం - loksabha
మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంటు స్థాయి తెరాస కార్యకర్తల సమావేశానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... లోక్సభ ఎన్నికల్లో గెలుపుకై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నాయకులు