తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటోన్మెంట్​లో 10 లక్షల మందికి ఇబ్బందులు: రేవంత్​రెడ్డి - revanth reddy

సికింద్రాబాద్ ​ కంటోన్మెంట్ ప్రాంతంలో సైన్యం రోడ్డు మూసివేయడం వల్ల రోజు సుమారు 10 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. లోక్​సభ శూన్య గంటలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రక్షణ శాఖ, కంటోన్మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమావేశం ఏర్పాటు చేసేలా ఆదేశించాలని సభాపతిని కోరారు.

కంటోన్మెంట్​ ప్రాంతంలో 10 లక్షల మందికి ఇబ్బందులు

By

Published : Jun 27, 2019, 5:28 PM IST

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో రోజూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. శూన్య గంటలో మాట్లాడిన రేవంత్‌... కంటోన్మెంట్‌లోని రోడ్డును సైన్యం మూసివేయడం వల్ల రోజూ సుమారు 10 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారనీ... స్పీకర్‌ చొరవ తీసుకొని రక్షణ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు.

కంటోన్మెంట్​ ప్రాంతంలో 10 లక్షల మందికి ఇబ్బందులు

'బిహార్‌ నుంచి గుజరాత్‌ వరకు, మహారాష్ట్ర నుంచి కేరళ వరకు, రాజస్థాన్‌ నుంచి కర్ణాటక వరకు అందరూ మా నియోజకవర్గంలో నివసిస్తుంటారు. అది ఓ చిన్న భారతదేశం. కంటోన్మెంట్‌ బోర్డులో సుమారు 10 లక్షల మంది అక్కడి రహదారిని వినియోగించుకుంటారు. రక్షణ మంత్రి రోడ్డు తెరవమని ఆదేశిస్తున్నా... 15-20 రోజులు తెరుస్తారు. ఆ తర్వాత మళ్లీ మూసివేస్తారు. ఇటీవల పాఠశాలలు తెరుచుకున్నాయి. రోడ్లు మూసివేయడంతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రక్షణ శాఖ, కంటోన్మెంట్‌ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం.. మూడింటితో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని మీరు రక్షణ మంత్రికి ఆదేశించాలని కోరుతున్నా. లేకపోతే ప్రతిరోజూ 10 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడతారు.'

- రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ

ఇవీ చూడండి:కశ్మీరులో అమిత్​షా.. రాష్ట్ర శాంతిభద్రతలపై సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details