ప్రభుత్వాన్ని అడగాలన్నా, కడగాలన్నా ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతు ఉండాలని మల్కాజిగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మనసురాబాద్ నుంచి నాగోల్ వరకూ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అధికార పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తోందని ఆరోపించారు. ప్రచారంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపండి: రేవంత్ - congress
నేటితో ప్రచార పర్వం ముగుస్తున్నందున తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేలా అభ్యర్థులు పూనుకున్నారు. నియోజక వర్గాల్లో బైక్ ర్యాలీలు చేస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఎల్బీనగర్లోని పలు డివిజన్లలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
ఇదీ చదవండి: సికింద్రాబాద్ బరిలో 'హస్త' సన్యాసమేనా?