కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లోని మేడోస్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్‌లో గత రాత్రి కురిసిన వర్షానికి ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో ప్రాణాపాయం లేకపోయినా.. నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. నాణ్యత సరిగా లేకపోవడం వల్లే గోడ కూలిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, భాజాపా జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు పరిశీలించారు. జేఎన్‌టీయు నుంచి నాణ్యత ప్రమాణాలను పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. భవన నిర్మాణ సమయంలో తీసుకున్న అనుమతుల ప్రకారమే తిరిగి నిర్మాణం చేయించి కాలనీవాసులకు న్యాయం చేస్తానన్నారు.