తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహారంపై అవగాహన' - బాచుపల్లి

మేడ్చల్‌ జిల్లాలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహార ఉత్సవాన్ని నిర్వహించారు. పోషకాహారంపై అవగాహన కల్పించారు.

'ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహారంపై అవగాహన'

By

Published : Sep 14, 2019, 10:18 PM IST

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహార ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రజలు బయటి ఆహార పదార్థాలపై ఆధారపడి అనారోగ్యానికి గురవుతున్నారని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గాయాత్రి వల్లి తెలిపారు. ఆహార నియమావళిని ఏర్పాటు చేసి ఆరోగ్యకర జీవనానికి తోడ్పడేలా సూచనలు చేశారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుందని చీఫ్ డైటీషియన్‌ డాక్టర్‌ ప్రశాంతి అన్నారు. వయసుల వారీగా పోషకాహారాలు ఏ మోతాదులో అందించాలనే దానిపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి ఛైర్మన్ దండు శివరామరాజు, వైద్య బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

'ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రిలో పోషకాహారంపై అవగాహన'

ABOUT THE AUTHOR

...view details