తెలంగాణ

telangana

ETV Bharat / state

"పుర' ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థికి సహకరించాలి" - 'పుర ఎన్నికల్లో రెబలిజం వద్దు.. పార్టీ అభ్యర్థికే మద్దతివ్వాలి'

మేడ్చల్ జిల్లా పీర్జాదీ గూడ పురపాలకలో తెరాస ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్​తో సహా జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.

'పీర్జాదీ గూడలో తెరాస ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు'
'పీర్జాదీ గూడలో తెరాస ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు'

By

Published : Dec 29, 2019, 9:57 PM IST

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ పరిధి ఉప్పల్ బస్ డిపో వద్ద తెరాస ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పీర్జాదిగూడ పురపాలక తెరాస ఇన్ ఛార్జీ దర్గ దయాకర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , చామకూర మల్లారెడ్డి , శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

'అప్పుడు పట్టించుకోలేదు... ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది'

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థికే అందరూ సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. స్వతంత్రంగా పోటీ చేస్తే పార్టీ పరంగా నష్టపోతారని సూచించారు. తెలంగాణ సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెరాస సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హాయాంలో పీర్జాదీ గూడలో ఇళ్లు సులభంగా అద్దెకు దొరికేవని..నేడు వంద గజాల భూమికి సైతం ధరలు ఆకాశాన్నంటున్నాయని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

సభలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, మేడ్చల్ జడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి , తెరాస నేత మర్రి రాజశేఖర్ రెడ్డి, చామకూర భద్రారెడ్డి, ఘట్ కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'పీర్జాదీ గూడలో తెరాస ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు'

ఇవీ చూడండి : రేపు గవర్నర్​ను కలవనున్న కాంగ్రెస్ నేతలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details