కూతురిపై 'ప్రేమ' అల్లుడుని హతమార్చింది
ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు కూతుర్ని మంచిగా చూసుకుంటాడనుకున్నాడు ఆ తండ్రి. కానీ బిడ్డ కుటుంబ కలహాలతో పుట్టింటికి రావడం వల్ల... అతనిలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెపై ప్రేమ ప్రతికారేచ్ఛను పెంచి అల్లుడిని అతికిరాతకంగా చంపేలా చేసింది.
అల్లుడుని చంపిన మామ
మేడ్చల్ జిల్లా బాలానగర్లో నివాసముంటున్న అమీర్... కైసర్ నగర్లో నివాసముండే హీనా బేగంను 15 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో బాలానగర్ పోలీసుల సాయంతో హీనా పాపతో పుట్టింటికి వెళ్లిపోయింది.