Medchal ward councilor husband attack on beside house: మేడ్చల్ జిల్లాలో అధికార పార్టీ వార్డు కౌన్సిలర్ భర్త దౌర్జన్యానికి పూనుకున్నాడు. మేడ్చల్ పట్టణంలో తెరాస పార్టీకి చెందిన 22 వ వార్డు కౌన్సిలర్ మాధవి భర్త నరేందర్.. పక్కింటి వారిపై దాడికి పాల్పడ్డాడు. దీపావళి పండుగ రోజున తన ఇంటి పక్కనే ఉన్న వారు కాల్చిన టపాసులు తన ఇంటి వైపు రావడంతో గొడవ మొదలైంది.
దీపావళి టపాసు ఇంటిపైకి వచ్చిందని వార్డు కౌన్సిలర్ భర్త దాడి.. - పక్క ఇంటిపై మేడ్చల్ వార్డు కౌన్సిలర్ భర్త దాడి
Medchal Ward councilor: దీపావళి రోజు అధికార పార్టీ వార్డు కౌన్సిలర్ భర్త హల్చల్ చేశాడు. తమ ఇంటిపైకి టపాసులు వచ్చాయని పక్క ఇంటిపై దాడి చేశాడు. తన అనుచరులతో కలిసి మహిళలను సైతం వదలకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మేడ్చల్
నరేందర్ తన అనుచరులతో కలిసి మోహన్ రెడ్డి ఇంట్లోకి చొరబడి మహిళలపై సైతం దాడి చేశాడని బాధితులు పేర్కొన్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. బాధితురాలు వినోద మోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి: