మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కళావతి నగర్‌కు చెందిన 30 మంది ములుగు నియోజకవర్గానికి చెందిన కూలీలు తమను ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్కను కోరారు. వెంటనే స్పందించిన సీతక్క తన నియోజకవర్గ వాసులకోసం గురువారం నగరానికి స్వయంగా వచ్చి నిత్యావసర సరకులను అందజేశారు.
నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క - నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క
జీడిమెట్లలోని కూలీలు తమను ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఫోన్లో సంప్రదించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీతక్క స్వయంగా వచ్చి నిత్యావసరాలను అందజేశారు.
Medchal district latest news
71 రోజులుగా నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నట్లు సీతక్క వెల్లడించారు. రెండు రోజుల క్రితం నగరంలోని మరో 50 మంది కూలీలకు కూడా నిత్యావసర సరకులను అందించినట్లు ఆమె పేర్కొన్నారు.
భాగ్యనగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 నివారణ కోసం ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించటంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.