మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేఎం. పాండు గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమ్మద్ అలీ ఆవిష్కరించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజలు మరచిపోలేనివని, బడుగు వర్గాల ఆశాజ్యోతి అని మహమ్మద్ అలీ అన్నారు. ఆయన చేసిన మంచి పనులకు, విగ్రహం పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆయనకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు. ఆయన ఎంతో మంది పేదలకు మంచి చేశారని వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కేఎం. పాండు గౌడ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , సీహెచ్. మల్లారెడ్డి , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్లో కేఎం పాండు విగ్రహావిష్కరణ - హోంశాఖా మంత్రి మహమ్మద్ అలీ
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తండ్రి కేఎం.పాండు విగ్రహాన్ని రాష్ట్ర హోంశాఖా మంత్రి ఆవిష్కరించారు. బడుగు వర్గాలకు ఆయన చేసిన సేవ ఎనలేనిదని గుర్తుచేసుకున్నారు.
కుత్బుల్లాపూర్లో కేఎం పాండు విగ్రహావిష్కరణ