తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం: మంత్రి - మంత్రి సత్యవతి రాఠోడ్​ తాజా వార్తలు

రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్‌ తెలిపారు. మేడ్చల్‌ జిల్లా ఫీర్జాదిగూడలోని గురుకుల కళాశాలను మంత్రి మల్లారెడ్డితో కలిసి సందర్శించారు. కొవిడ్‌ జాగ్రత్తలు, సదుపాయాలను పరిశీలించారు.

MEDCHAL DISTRICT
'నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని విధాల కృషి'

By

Published : Feb 3, 2021, 11:29 AM IST

రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలలో నాణ్యమైన బోధన జరుగుతుందని మంత్రి సత్యవతి రాఠోడ్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలోని ప్రభుత్వ గిరిజన గురుకుల అర్బన్‌ కళాశాలను సందర్శించారు. విద్యా సంస్థల్లో వసతుల కల్పన, సిబ్బంది హాజరు, కొవిడ్​ నిబంధనల పాటింపు తదితరాల పర్యవేక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ అయిష్టంగానే విద్యాసంస్థల ప్రారంభానికి అంగీకరించినా... జాగ్రత్తలు మాత్రం పక్కాగా తీసుకున్నామని మంత్రి వివరించారు. గిరిజన సంక్షేమ శాఖలో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి విజయ లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

'నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని విధాల కృషి'

ఇదీ చూడండి:హ్యాట్సాఫ్​: రహదారికి 'పోలీసు' మరమ్మతులు

ABOUT THE AUTHOR

...view details