పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అభివృద్ధికి నిధుల కొరత రాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఫిర్జాదిగూడా నగరపాలక సంస్థ పరిధిలో రూ.1.54 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
పట్టణాల అభివృద్ధే ధ్యేయం: మంత్రి మల్లారెడ్డి - పీర్జాదిగూడలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మల్లారెడ్డి
తెరాస హయాంలోనే పట్టణాల రూపురేఖలు మారాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మేయర్ జక్కా వెంకట్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
mallareddy
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. అనంతరం ఆచార్య జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు. సాయిప్రియ కాలనీలో మొక్కలు నాటారు.
ఇదీ చూడండి:kcr: ఆచార్య జయశంకర్ యాదిలో సీఎం కేసీఆర్