మనోధైర్యానికి మించిన మందు లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని జ్యోతిరావు పూలే బీసీ బాలుర వసతి గృహంలో కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కరోనా నియంత్రణకు ప్రతి జిల్లాకు ఒక టాస్క్‌ఫోర్స్ బృందం ఉంటుందని మంత్రి వెల్లడించారు.
'కరోనా నియంత్రణకు ప్రతి జిల్లాకు టాస్క్‌ఫోర్స్ బృందం' - బాలుర వసతి గృహంలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం
ఘట్కేసర్లోని జ్యోతిరావు పూలే బీసీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రతి జిల్లాకు ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
బాలుర వసతి గృహంలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం
విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవమే లక్ష్యంగా టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ నియంత్రణలో వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల పాత్ర కీలకమైందని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ముల్లిపావని, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఏపీ, తెలంగాణలో కొవిడ్ -19 సహాయక చర్యలకు రిలయన్స్ మద్దతు