మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని చెంగిచర్లలో కేఆర్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కరోనా వైరస్ – లాక్డౌన్ కారణంగా క్యాన్సర్, తలసేమియా రోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి - రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
క్యాన్సర్, తలసేమియా రోగులు రక్తం కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కేఆర్ఎల్ ఫౌండేషన్ సభ్యులు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
ఈ కార్యక్రమంలో 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, మాజీ జడ్పీటీసీ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు