పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్ రావు సాయిబాబాను దర్శించుకున్నారు. మేడ్చల్ జిల్లా ఫీర్జాదీగూడలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన మందిరంలో ఉన్నారు.
ఫీర్జాదీగూడ సాయిబాబా ఆలయంలో హరీశ్‌రావు - మేడ్చల్ జిల్లావార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉండే మంత్రి హరీశ్ రావు సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదీగూడ నగరపాలక పరిధిలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
పీర్జాదీగూడ సాయిబాబా ఆలయంలో హరీశ్‌రావు
ఈరోజు నాచారంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఫీర్జాదీగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఆయనతో పాటు ఉన్నారు. కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థ అభివృద్ధిపై మేయర్‌ను హరీశ్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.