తెలంగాణ

telangana

ETV Bharat / state

మానసిక వికలాంగులను చేరదీస్తున్న మాతృదేవోభవ ఆశ్రమం

నగరంలో మానసిక వికలాంగులను గుర్తించి చేరదీస్తున్నారు మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు. నాదర్‌గుల్‌లో ఉన్న ఆశ్రమం ద్వారా ఆపన్నహస్తం అందించి ఆదుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసుకునే ఆరుగురిని గుర్తించి చేరదీశారు.

Mentally abled persons help by matrudevobhava Ashramam in nadargul
మానసిక వికలాంగులను చేరదీస్తున్న మాతృదేవోభవ ఆశ్రమం

By

Published : Oct 14, 2020, 6:58 AM IST

అత్యంత దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న మానసిక వికలాంగులకు మేమున్నాం అంటూ చేయూత అందిస్తున్నారు మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరి. మేడ్చల్ జిల్లా నేరెడ్‌మెట్, ఈసీఐఎల్, ఉప్పల్ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న ఆరుగురు మానసిక వికలాంగులను గుర్తించి చేరదీశారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సమక్షంలో వారిని ఆశ్రమానికి తరలించారు. ఇకపై వారి పూర్తి బాధ్యతను ఆశ్రమం చూసుకుంటుందన్నారు. సమాజ సేవ చేస్తున్న ఆశ్రమ నిర్వాహకుడు గట్టు గిరిని సీపీ అభినందించారు. వారికి అవసరమైన అన్ని రకాల వైద్యచికిత్సలు, పౌష్టికాహారాన్ని అందిస్తామని సీపీ హామీ ఇచ్చారు. మాములు స్థితికి వచ్చాక వారి కుటుంబసభ్యులు ఎవరైనా ఉంటే అప్పగిస్తామని మహేష్ భగవత్ తెలిపారు.

ఇదీ చూడండి:విషాదం... పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details