మేడ్చల్ జిలలా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో కొందరు రైతులు తమకున్న ఒక ఎకరా 25 గుంటల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజారెడ్డికి 11 గుంటల భూమిని అమ్మినట్లు బాధిత రైతులు తెలిపారు. కానీ ఆయన మాత్రం మిగతా ఒకరా 9 గుంటల భూమిని కూడా కబ్జా చేశారని చెబుతున్నారు.
'మా భూమి మాకిప్పించండయ్యా.. దండం పెడతాం..'
సాగు చేసుకుంటున్న భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేసినా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్రే పోషిస్తున్నారని... ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా రైతులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
ఈ విషయంపై బాధిత రైతులందరూ రాజారెడ్డిని ప్రశ్నించగా... అతడు తన అనుచరులతో తమపై దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ... ఎస్ఐ గంగిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాములు రియల్ ఎస్టేట్ వ్యాపారికి వత్తాసు పలుకుతూ తమనే బెదిరిస్తున్నారని వాపోతున్నారు. కబ్జాకు గురైన తమ భూమిని తమకి ఇప్పించాలని... అలాగే కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
ఇవీ చూడండి:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్