తెలంగాణ

telangana

ETV Bharat / state

మినహాయింపునకై 'మల్లారెడ్డి' విద్యార్థుల ధర్నా

ఇంజినీరింగ్ విద్యలో ఉన్న థియరీ సబ్జెక్టుల్లో మినహాయింపు ఎత్తివేయడంపై మల్లారెడ్డి కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు.

మినహాయింపు కై మల్లారెడ్డి విద్యార్థుల ధర్నా

By

Published : Jul 10, 2019, 5:22 PM IST

Updated : Jul 10, 2019, 6:01 PM IST

మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మ‌ల్లారెడ్డి ఇంజినీరింగ్ మెయిన్ క్యాంపస్ కళాశాల వ‌ద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. జె.ఎన్.టి.యూ హైదరాబాద్ విద్యార్థులకు వర్తించినట్లే తమకు రెండు సబ్జెక్టుల్లో మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు.

మినహాయింపునకై 'మల్లారెడ్డి' విద్యార్థుల ధర్నా


ఇంజినీరింగ్ విద్యలో గత ఆర్​-13 బ్యాచ్ వారికి థియరీ సబ్జెక్టులలో వారికి 2 సబ్జెక్టులను (8 క్రెడిట్స్) వదులుకునే అవకాశం ఉండేది.
ఆర్​-15 బ్యాచ్ వారికి ఆ నిబంధనలు ఎత్తివేయడం వల్ల జె.ఎన్.టి.యూ విద్యార్థులు ధర్నా చేయగా వారికి 2 సబ్జెక్టులను తిరిగి వదులుకునే అవకాశం కలిపించారు. జె.ఎన్.టి.యు పరిధిలోని వి.యన్.ఆర్, మల్లారెడ్డి కాలేజీ(ఎంఆర్​సీఈటీ) యాజమాన్యాలు మాత్రం మినహాయింపు ఇచ్చి... మల్లారెడ్డి(ఎంఆర్ఈసీ)కి ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు. వెంటనే
సమస్యను పరిష్కరించాలని ఎన్.ఎస్.యూ.ఐ. విద్యార్థులు కళాశాల వినతి పత్రం ఇచ్చారు. వారం లోపు సమస్య పరిష్కరించకుంటేతిరిగి ఆందోళన చేస్తామని వారు తెలిపారు.

ఇదీ చూడండి:బావిలోకి దిగిన యువకులు ఎలా చనిపోయారు..!

Last Updated : Jul 10, 2019, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details