మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడకు చెందిన భవానీకి ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డికి 2013లో వివాహం జరిగింది. వివాహనతరం వీరికి కూతురు పుట్టింది. అప్పటి నుంచి ఆడపిల్ల పుట్టిందని భర్త, కుటుంబ సభ్యులు హింసించడం మొదలు పెట్టారని భవాని ఆవేదన వ్యక్తం చేసింది.
అత్తింటి ముందు కోడలి ఆందోళన
ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఇంట్లో నుంచి గెంటివేయడం వల్ల ఓ వివాహిత అత్తింటి ముందు బిడ్డతో కలిసి ఆందోళనకు ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. తనను, తన భర్తను కలపాలని కోరుతోంది.
అత్తింటి ముందు కోడలి ఆందోళన
గతంలో వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు.. భవానీ కొన్నిరోజులుగా బిడ్డతో కలిసి పుట్టింట్లో ఉంటుంది. తనభర్తతో కలిసి ఉండాలని వస్తే ఇంట్లోకి రానివ్వడం లేదని ఇంటిముందు దీక్ష చేపట్టింది. తనను, తన భర్తను కలపాలని కోరుతోంది.
ఇదీ చూడండి :కేంద్రంపై పోరుకు కాంగ్రెస్ సమాయత్తం!
Last Updated : Feb 14, 2020, 12:05 AM IST