తెలంగాణ

telangana

ETV Bharat / state

Lack of Infrastructure in govt schools: ఇరుకిరుకు గదులు.. నేలపైనే చదువులు..! - Lack of Infrastructure in telangana govt schools

ప్రైవేటు బడులు, కార్పొరేట్​ స్కూళ్లలో ఫీజుల భారం మోయలేక.. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొవిడ్​ తెచ్చిన ఆర్థిక సంక్షోభమే ఇందుకు కారణం కాగా.. సర్కారు బడుల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తుండటం ఇందుకు మరో కారణం. కానీ.. మౌలిక సదుపాయల కొరత(Lack of Infrastructure in govt schools).. ప్రభుత్వ బడులకు మచ్చగా మారింది. సర్కారు పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించేందుకు.. అధికారులు కార్యాచరణ రూపొందిస్తే.. వాటి పురోగతి మరో విధంగా ఉండేది. 100లో ఒకటి దాతల సహృదయంతో రూపురేఖలు మార్చుకుంటుంటే.. మిగిలినవి మాత్రం పైన పటారం.. లోన లొటారంలా మారిపోయింది. మేడ్చల్​ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మాత్రం విద్యార్థులను ఇక్కట్లకు గురిచేస్తోంది.

lack of infrastructure in government schools
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కరవు

By

Published : Nov 29, 2021, 2:47 PM IST

Lack of Infrastructure in govt schools: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుందాం అంటే తరగతి గదులు లేవు.. ఎలాగోలా కూర్చుందాం అంటే బల్లలు లేవు. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేసేందుకు ప్రైవేటు స్కూళ్లకు దీటుగా విద్యను అందిస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నా.. అవి మాటలకే పరిమితమవుతున్నాయి. ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ఉంది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం.. నగర శివర్లలోని బాలాజీ నగర్(lack of facilities in telangana government schools) ప్రభుత్వ పాఠశాలనే ఇందుకు నిదర్శనం. ఈ పాఠశాలలో మొత్తం 900 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ తరగతి గదులు విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేకపోవడంతో బెంచీలు ఇరుకై కింద కూర్చునే పాఠాలు వింటున్నారు.

'పక్కా సమాచారం ఇస్తే... మౌలిక వసతులు సమకూరుతాయ్'

40కి వంద

ఈ పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎనిమిదో తరగతికి(Telangana government schools) చెందిన ఒక గదిలో 35 నుంచి 40 మంది కూర్చోవాల్సి ఉండగా.. సుమారు 100కు పైగా సర్దుకుపోయారు. కరోనా నిబంధనలతో ఒక్కో బెంచీకి ఇద్దరు మాత్రమే పరిమితం కావాలి. కానీ ముగ్గురు, నలుగురు చొప్పున కూర్చొని వైరస్​ విజృంభణకు మళ్లీ తావిస్తున్నట్లుగా ఉంది. కొవిడ్​ కేసులు తగ్గడంతో.. మహమ్మారి కనుమరుగైపోయిందని జనం అంతకుముందులా జీవనం సాగిస్తుంటే.. గత కొన్ని రోజులుగా కరోనా కొత్త రకం వేరియంట్​ ఒమిక్రాన్(Corona new variant omicron)​ మళ్లీ ఆందోళనను కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్​ నిబంధనలు గాలికొదిలేసి.. ఉపాధ్యాయులు విద్యార్థులను ఇలా కూర్చోబెట్టడం.. వారి నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. కొవిడ్​ సంగతి పక్కన పెడితే.. ఉన్న బెంచీలపై ఎలాగోలా సర్దుకున్నాం అనేలోపు.. మిగిలిన విద్యార్థులు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి. దీంతో వేరే దారి లేక.. ఆ రోజు తరగతులన్నీ ముగిసేవరకు నేలపైనే కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది చిన్నారులకు.

పాఠశాల ఆవరణలో

తరగతి గదులు తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే పరిమితికి మించకుండా కూర్చోబెట్టాల్సి ఉన్నా.. గత్యంతరం లేక ఇలా ఒకే గదిలో కిక్కిరిసినా కూర్చోబెడుతున్నారు. మరో వైపు గదులు ఇరుకిరుకు కావడంతో కూర్చోడానికి చోటు లేని మిగిలిన విద్యార్థులకు పాఠశాల ఆవరణలో నేలపై కూర్చో పెట్టి సిబ్బంది చదువులు చెబుతున్నారు. మొత్తం 900 మంది విద్యార్థులు ఉంటే కేవలం 14 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని ఉపాధ్యాయులు తెలిపారు. కనీసం బడికి గంట కొట్టే కిందిస్థాయి సిబ్బంది కూడా లేరని ఆవేదన వెలిబుచ్చారు.

ఇదీ చదవండి:Corona Cases in gurukul school: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 43మందికి పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details