లోక్‌సభ ఎన్నికల సమరానికి తెరాస శంఖారావం పూరించింది. 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేటి నుంచి పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి బయలుదేరిన కేటీఆర్‌కు శామీర్ పేట్ వద్ద కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ అభివాదం చేశారు.
తెరాస సన్నాహాలు షురూ - flag
తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు తెరాస సన్నాహాలు ప్రారంభించింది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్‌కు బయలుదేరారు.
సభకు బయలుదేరిన కేటీఆర్