తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2020, 8:54 AM IST

ETV Bharat / state

హైదరాబాద్​లోనూ అదే విధంగా కష్టపడాలి: కిషన్​రెడ్డి

దుబ్బాకలో భాజపా కార్యకర్తలు ఏ విదంగా కష్టపడ్డారో.. హైదరాబాద్​లోనూ అదే విధంగా కష్టపడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సూచించారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించి భాజపా గెలుపునకు కృషి చేయాలని వారు సూచించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో భాజపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

kishan reddy said the bjp activists same work should be done in ghmc elections
హైదరాబాద్​లోనూ అదే విధంగా కష్టపడాలి: కిషన్​రెడ్డి

హైదరాబాద్​లోనూ అదే విధంగా కష్టపడాలి: కిషన్​రెడ్డి

దుబ్బాక భాజపా గెలుపు స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో పని చేయాలని కార్యకర్తలను భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కొంపల్లిలో మేడ్చల్ అర్బన్ జిల్లా భాజపా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. మేడ్చల్ అర్బన్ జిల్లా పరిధిలోని 39 డివిజన్లకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అతిత్వరలో గ్రేటర్ ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

కమిషన్​లు తీసుకున్నారు

దుబ్బాక విజయం తర్వాత భాజపా అంటే కేసీఆర్ భయపడుతున్నాడని బండి సంజయ్ తెలిపారు. నగరంలో వరదల వల్ల లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగితే కేవలం 10 వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. అందులోనూ తెరాసకు చెందిన పలువురు కమిషన్​లు తీసుకున్నారని ఆరోపించారు. ఎంఐఎంను అడ్డం పెట్టుకుని ఈ సారి జీహెచ్ఎంసీలో గెలవాలని తెరాస చూస్తుందని బండి పేర్కొన్నారు.

ఒక్కటి కూడా కట్టలేదు

జీహెచ్​ఎంసీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్​కు జరగబోయే ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. పాతబస్తీకి వెళ్లాల్సిన మెట్రో అప్జల్​ గంజ్ దాటక పోవడానికి కారణం తెరాస, ఎంఐఎం​ అని ఆరోపించారు. నాలుగు ప్రభుత్వాసుపత్రులు కడతానని.. ఇప్పటివరకు ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. వరదల వల్ల ఆరు లక్షల కుటుంబాలు రోడ్డున పడి, 40 మంది చనిపోతే ముఖ్యమంత్రి పరామర్శించ లేదన్నారు. హైదరాబాద్​లో కొవిడ్ కట్టడి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చర్చలకు ఎక్కడికైనా వస్తామని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

దారుణంగా రోడ్లు

ట్యాంక్ బండ్​ను శుద్ధి చేస్తామని ఇప్పటివరకు చేయలేదని కిషన్​ రెడ్డి తెలిపారు. నగరంలోని బస్తీలు, కాలనీల్లో రోడ్లు భయంకరంగా మారాయనీ దుయ్యబట్టారు. కొంపల్లి ఉమా మహేశ్వర కాలనీలో ప్రజలు ఇంకా నీటిలోనే మగ్గుతున్నారని అన్నారు. ఓయూలోని వసతి గృహాలు కూలుతున్నా పట్టించుకోవట్లేదని, రోడ్లను కేవలం హైటెక్ సిటీ వైపు మాత్రమే వేస్తున్నారని, ఓల్డ్ సిటీ, మల్కాజిగిరి, ఎల్బీనగర్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు.

డబుల్​ బెడ్​ రూం పేరుతో

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలిస్తే రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కేవలం డబుల్​ బెడ్​ రూం పేరుతో తెరాస గతంలో జీహెచ్ఎంసీలో గెలిచిందని విమర్శించారు. ఈసారీ తెరాస ఓట్లు అడుగే హాక్కు లేదని, దేశంలో కుటుంబ పాలనలు కుప్పకులుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణ, లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు మోత్కుపల్లి‌ నర్శింహులు, పెద్దిరెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్, ప్రభాకర్, విజయ రామరావు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


ఇదీ చూడండి :పారదర్శకంగా బల్దియా ఎన్నికలు: ఎస్ఈ​సీ పార్థసారథి

ABOUT THE AUTHOR

...view details