తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy Fires on Telangana Government : 'తెలంగాణలో ప్రభుత్వ భూములు, మద్యం అమ్మనిదే పాలన సాగే పరిస్థితి లేదు' - Kishan Reddy Latest News

Kishan Reddy Fires on Telangana Government : పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని బీఆర్ఎస్ సర్కార్‌.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కొందరు వ్యక్తులు ప్రధాని మోదీని ట్విటర్‌లో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. విద్య అభ్యసించింది అమెరికాలో.. అనేది ఇక్కడని దుయ్యబట్టారు. తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి దోచుకుంటున్నారని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 9:40 PM IST

Kishan Reddy Fires on Telangana Government in Medchal District : దళితులను దద్దమ్మలుగా చిత్రీకరించి.. కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆక్షేపించారు. ఉద్యోగ పరీక్షలను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం అని మండిపడ్డారు. మలిదశ ఉద్యమంలో యువత బలి దానాలకు కాంగ్రెస్ కారణం కాదా అని సూటిగా ప్రశ్నించారు. హస్తం పార్టీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తేల్చిచెప్పారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు'

Kishan Reddy Comments on CM KCR : పార్లమెంట్‌లో.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు పాస్ అవుతుంటే పాల్గొనని మూర్ఖుడు కేసీఆర్ (KCR) అని.. కిషన్‌రెడ్డి విమర్శించారు. మిలియన్ మార్చ్, సాగరహారానికి రాని ముఖ్యమంత్రి.. తెలంగాణ తాను తెచ్చినట్లు గొప్పలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములు, మద్యం అమ్మనిదే పాలన సాగే పరిస్థితి లేదని అవేదన వ్యక్తం చేశారు. సీఎం కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తెలంగాణను దోచుకుంటున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

BJP State Level Council Meeting in Ghatkesar : పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని బీఆర్ఎస్ సర్కార్.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని కిషన్‌రెడ్డి విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఓవైసీ కుటుంబానికి.. కేసీఆర్ కుటుంబం కట్టు బానిసలాగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కొందరు వ్యక్తులు ప్రధాని మోదీని ట్విటర్‌లో విమర్శిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్య అభ్యసించింది అమెరికాలో.. అనేది ఇక్కడని ధ్వజమెత్తారు. తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి దోచుకుంటున్నారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Kishan Reddy about Krishna Water Sharing : 'కేంద్ర నిర్ణయంతో కృష్ణా జలాల సమస్య పరిష్కారమవుతుందని ఆకాంక్షిస్తున్నా'

Kishan Reddy Criticism Congress : మజ్లిస్ నాయకులు కనిపిస్తే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలు వంగివంగి దండాలు పెడుతున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య తెలంగాణగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమగ్రమైన ఎన్నికల ప్రణాళికతో సమర శంఖారావం పూరించాల్సి ఉందని పిలుపునిచ్చారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నుంచి కాషాయ జెండా ఎగురవేస్తామనే ఆత్మ విశ్వాసంతో మన ప్రాంతాలకు వెళ్లాలని కిషన్‌రెడ్డి సూచించారు.

"పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని బీఆర్ఎస్ ప్రభుత్వం.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం. మలిదశ ఉద్యమంలో యువత బలి దానాలకు కాంగ్రెస్ కారణం కాదా..?. కాంగ్రెస్‌కు తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. మజ్లిస్ నాయకులు కనిపిస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వంగివంగి దండాలు పెడుతున్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy Fires on Telangana Government తెలంగాణలో ప్రభుత్వ భూములు, మద్యం అమ్మనిదే పాలన సాగే పరిస్థితి లేదు

అంతకుముందు జేపీ నడ్డా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్​ పాలన.. రజాకార్ల పాలనను తలపిస్తోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్​ కుటుంబ పాలనకు.. ప్రజలు చరమగీతం పాడనున్నారని అన్నారు. భ్రష్టాచార్ రిస్తేదార్ సమితి అంటూ దుయ్యబట్టారు.దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కటే జాతీయ పార్టీ అని పేర్కొన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. ప్రస్తుతం ప్రాంతీయ స్థాయికి పడిపోతోందని జేపీ నడ్డా విమర్శించారు.

Kishan Reddy Comments on CM KCR : 'ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్ ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు'

Kishan Reddy on Telangana assembly Election 2023 : 'ఆరు నెలలు తర్వాత కాదు.. డిసెంబరు మొదటి వారంలోనే అసెంబ్లీ ఎన్నికలు'

ABOUT THE AUTHOR

...view details