మేడ్చల్ జిల్లా సూరారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మధిరకు చెందిన షేక్ సుభాన్, షర్మిల దంపతులు నివాసిస్తున్నారు. వీరికి రెండేళ్ల పాప హైదర్ ఫిర్దుష్ ఉంది. సుభాన్ ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 5 సాయంత్రం ఇంట్లో సిలిండర్ అయిపోవడం వల్ల కొత్త సిలిండర్ అమర్చాడు. సిలిండర్ లీకవుతున్న విషయాన్ని వారు పసిగట్టలేకపోయారు.
కుటుంబాన్ని బలిగొన్న సిలిండర్ - GAS LEAK IN SURARAM COLONY ALL FAMILY MEMBERS ARE DEATH
గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబం మొత్తం మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా సూరారంలో జరిగింది. ప్రమాదం జరిగిన రోజే దంపతులు మృతి చెందగా... వారి రెండేళ్ల చిన్నారి ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
కుటుంబాన్ని బలిగొన్న సిలిండర్
ఈ నెల 6న తెల్లవారుజామున 5.30 నిమిషాల సమయంలో సుభాన్ నిద్రలేచి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు స్విచ్ ఆన్ చేయగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇంట్లో ఉన్న ముగ్గరు 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి చేరగా సుభాన్, షర్మిల మృతి చెందారు. పాప హైదర్ ఫిర్దుష్ చావుతో పోరాడి ఇవాళ మృతి చెందింది.
ఇవీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య