మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న లక్ష్మీ శ్రీనివాస కనస్ట్రక్షన్ సంస్థపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అన్నారు. కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టడాలు కడుతున్నారని ఆరోపించారు.
'అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలి'
అక్రమ కట్టడాలను అడ్డుకట్టవేసి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మల్లంపేటలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
సర్వేనంబర్ 170లోని 104.32 ఎకరాల విస్తీర్ణం ఉండగా... గతంలో ఐదెకరాల భూమిని ప్రభుత్వం మాజీ సైనికుడికి కేటాయించగా... అతని నుంచి ఆ భూమిని కొనుగోలు చేసిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
సుమారు 45 ఎకరాలకు పైగా లావాని పట్టాలో 200 విల్లాలను అక్రమంగా నిర్మించారన్నారు. ఈ ఆక్రమణపై హైకోర్టులో తాను వేసిన పిటిషన్ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించడం శుభపరిణామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.