ఇన్ని జీవీకె 108 అంబులెన్స్‌లు ఎలా కాలిపోయాయి ??? - medchal
ఎండ కాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అగ్నిప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలంలోని దేవరయంజాల్ జీవీకే-ఈఎమ్ఆర్ఐలో అగ్నిప్రమాదం జరిగింది.
మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలంలోని దేవరయంజాల్ జీవీకే-ఈఎమ్ఆర్ఐలో నిరుపయోగంగా ఉన్న 108 వాహనాలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. సుమారు అరవై 108 అంబులెన్స్ వాహనాలు దగ్ధం అయినట్లు తెలిస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. గత 10 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న వాహనాలను జీవీకేలోని ఖాలీ స్థలంలో ఉంచారని సిబ్బంది తెలిపారు. ఎండాకాలం కారణంగా అగ్ని ప్రమాదం జరగొచ్చని భావిస్తున్నారు.ఇవీ చూడండి: నిర్మల్ జిల్లాలో మంత్రి కొడుకు హల్చల్...