మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా పరిశ్రమలో ఎవరూ లేకపోవడం వల్ల మంటలు పక్కనున్న అట్టల పరిశ్రమకి వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ పరిశ్రమలో ఉన్న సామగ్రి మొత్తాన్ని కాల్చివేశాయి.
హైటెక్ పరిశ్రమలో మంటలు.. - మేడ్చల్ జిల్లా హైటెక్ పరిశ్రమలో మంటలు
మేడ్చల్ జిల్లాలోని ఓ పరిశ్రమలో మంటలు వ్యాపించి పక్కనున్న మరో పరిశ్రమకు వ్యాపించాయి. జనతా కర్ఫ్యూ వల్ల కార్మికులు విధులకు హాజరు కానందున ప్రాణనష్టం ఏమీ జరగలేదు.
హైటెక్ పరిశ్రమలో మంటలు.. పక్కనున్న మరో పరిశ్రమ దగ్ధం..
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కరోనా కట్టడి కోసం నేడు అందరూ సెలవు పాటిస్తున్నందున కార్మికులెవరూ విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు.
Last Updated : Mar 23, 2020, 9:18 AM IST