తెలంగాణ

telangana

ETV Bharat / state

కూతురిపై కన్నతండ్రి అత్యాచారం - తప్పించుకునే క్రమంలో మరో డేంజర్​లోకి - కుమార్తెపై తండ్రి రేప్

Father Raped Daughter in Hyderabad : మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కన్నతండ్రే కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం చెబితే తల్లి పట్టించుకోలేదు. ఏం చేయాలో పాలుపోని ఆ యువతి తండ్రి నుంచి తప్పించుకునే క్రమంలో మరింత ప్రమాదంలోకి వెళ్లింది. అసలేం జరిగింది?

Father raped Daughter
Father raped Daughter

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 10:57 AM IST

Updated : Jan 5, 2024, 2:40 PM IST

Father Raped Daughter in Hyderabad : సమాజంలో రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు మరికొందరు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే(Father Raped Daughter)కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు. హైదరాబాద్ శివారులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Rape Cases in Hyderabad : మానవత్వం మంట కలిసింది. ఓ కర్కశ తండ్రి, కన్నకూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పినా ఫలితం లేకపోవడంతో అతడి బారినుంచి తప్పించుకునేందుకు వేసిన అడుగులు బాధితురాలిని మరింత ప్రమాదంలో పడేేశాయి. తండ్రి నుంచి తప్పించుకుని ఇంటి నుంచి వెళ్లిన ఆ యువతి ఉపాధి ఆశతో వెళ్లి ఓ యువకుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

అత్యాచారం చేసి చంపేశారు..! పాలమూరులో వెలుగుచూసిన అకృత్యం..

ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం : బీహర్‌కు చెందిన ఓ కుటుంబం వలస వచ్చి హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కుమార్తె(18) తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. కుటుంబీకులు సదరు యువతిని కొవిడ్ కారణంగా చదువు మాన్పించడంతో ఇంటి వద్దే ఉంటోంది. కొంతకాలంగా తండ్రి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పొద్దంటూ తండ్రి సదరు యువతిని భయపెట్టాడు.

Rape Cases in Telangana :ఈ విషయాన్ని అమ్మాయి తల్లికి చెప్పగా, తండ్రిపై లేనిపోనివి చెప్పొదంటూ యువతిపై మండిపడింది ఆ తల్లి. గత సంవత్సరం దీపావళికి వీరు బీహర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలులో వచ్చిన సమయంలో, అదే రాష్ట్రానికి చెందిన యువకుడు సంతోశ్ పరిచయమయ్యాడు. అదే సమయంలో ఇద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు చాట్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సంతోశ్ గాంధీనగర్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. రోజూ చాట్ చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిత్యం పెరిగింది.

రన్నింగ్ ట్రైన్​లో రేప్​.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం

ఈ క్రమంలోనే గత నెల 26న సంతోశ్ కలవాలని కోరడంతో సదరు యువతి సికింద్రాబాద్‌ వెళ్లింది. ఇద్దరు కలిసి ఎన్టీఆర్‌ గార్డెన్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో తిరిగారు. తరువాత అతడు కుత్బుల్లాపూర్‌లో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కొడతారనే భయంతో ఆ అమ్మాయి తిరిగి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్‌ తీసుకొని సంతోశ్​కు ఫోన్‌ చేసింది. అతను తన ఇంటికి రావాలని చెప్పగా రవి సాయంతో సంతోశ్ ఇంటికి వెళ్లింది.

మరుసటిరోజు తనను ఇంటికి వెళ్లిపోమని సంతోశ్ చెప్పడంతో యువతి రవితో కలిసి వెళ్లింది. అయితే అప్పుడు కూడా యువతి తన ఇంటికి వెళ్లకుండా రవిని ఉద్యోగం ఇప్పించమని కోరింది. ఈ నేపథ్యంలో రవి ఉద్యోగం ఇప్పిస్తానని అమీన్‌పూర్‌లోని తన గదికి తీసుళ్లాడు. రెండు రోజులు అక్కడే ఉన్న ఆమెపై గత నెల 29న మద్యం మత్తులో రవి లైంగిక దాడిచేశాడు.

అతడి నుంచి తప్పించుకున్న యువతి మరుసటి రోజు కుటుంబీకులకు ఫోన్‌చేసి సికింద్రాబాద్‌ స్టేషన్‌ రావాలని చెప్పింది. వారు వచ్చిన తర్వాత జరిగిన విషయం వివరించింది. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని ఆరా తీయగా రవితో పాటు తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి ఆమె చెప్పింది. దీంతో పోలీసులు రవితో పాటు బాధితురాలి తండ్రిపై కూడా అత్యాచారం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్​స్పెక్టర్ పవన్ తెలిపారు.

ఉద్యోగం పేరుతో 'ఆమె'ను వ్యభిచార ఊబిలోకి నెట్టిన అంకుల్​..

మైనర్​పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142ఏళ్ల శిక్ష.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

Last Updated : Jan 5, 2024, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details