గ్రామాల్లో నాణ్యతగల నిత్యావసర వస్తువుల తయారీ కోసం చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే మహిళలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తుందని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాణ్యతగల పండ్లు, నిత్యావసర సరకుల విక్రయ కేంద్రాలను... అలాగే ప్రతాప్ సింగారంలో కొత్తగా నిర్మించిన రైతువేదికను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల్లో నాణ్యత ఉండటం లేదన్న ఆయన.. గ్రామాల్లో సాగు చేసే మిర్చి, పసుపు పంటల్లో మంచి నాణ్యత ఉంటుందని తెలిపారు. అలాంటి పంటలను సాగు చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు.