Polling Arrangements in Medchal District :మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 28,19,067 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 14,59,629 మంది, స్త్రీలు 13,59,057 మంది, థర్డ్ జెండర్లు 381 మంది ఓటర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువకులు 59,213 మంది ఉన్నారు.
Medchal District Polling 2023 :జిల్లా వ్యాప్తంగా 841 ప్రాంతాల్లో 2,439 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో అర్బన్ పోలింగ్ స్టేషన్లు 2,280, రూరల్ ప్రాంతంలో 159 వరకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పదహారు విభాగాలకు ప్రత్యేకంగా 22 మంది నోడల్ అధికారులను నియమించారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 126 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
నిఘా నీడలో తెలంగాణ - శాసనసభ పోలింగ్‌కు పకడ్బందీ గస్తీ
జిల్లాలో 2,439 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మహిళా పోలింగ్ స్టేషన్ల చొప్పున ఐదు నియోజకవర్గాలలో 25 మహిళా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాలలో పూర్తిగా మహిళా అధికారులు, సిబ్బంది ఉండి ఎన్నికల విధులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగులుకు ఒకటి చొప్పున ఐదు నియోజకవర్గాలకు ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Polling Centers at Medchal District : ఈ పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా దివ్యాంగులు ఎన్నికల విధులను నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. యువత కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో యువ ఎన్నికల అధికారులు(Election Officers)సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు చొప్పున మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తెలంగాణలో పోలీసుల పటిష్ఠ నిఘా - ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం - ఇప్పటివరకు రూ.737 కోట్ల సొత్తు స్వాధీనం
జిల్లావ్యాప్తంగా తనిఖీల్లో ఇప్పటి వరకు జప్తు చేసిన నగదు, ఆభరణాలు, బంగారం మొత్తం విలువ.. రూ.60,82,93,018 రూపాయలు అని కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ఇందులో నగదు- రూ.36,13,52,308, రూ.24,69,40,710 విలువైన బంగారం, వెండి మిగతా ఇతరత్రా వస్తువులు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2,29,214 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని 1,292 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 598 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. పోలింగ్ ప్రారంభమయ్యే వరకు నిఘా మరింత పెంచుతామని స్పష్టం చేశారు.
జిల్లాలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లయితే ప్రజలు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా రూపొందించిన సీ–విజిల్ యాప్(C-vigil App)ద్వారా ఫిర్యాదు చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రజలకు సూచించారు. సీ– విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులో ఫిర్యాదుదారు తమ ఫోన్ నెంబర్, వివరాలు లేకుండా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు సీ–విజిల్ యాప్ ద్వారా 430 కేసులు నమోదు కాగా వాటిని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిష్కరించారని వెల్లడించారు.
ఇట్స్ ఓటర్ టైం - శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం
పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఇవి తప్పనిసరి..
- ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఫొటోతో ఉన్న ఓటరు కార్డ్(Voter Card)ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డ్ ఏదైనా ఒకదాన్ని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి.
- ఓటర్ ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డ్ లేదా బ్యాంక్ పాస్ బుక్ (ఫొటోతో ఉన్నవి), పోస్టాఫీస్(ఫొటోతో ఉన్నవి)పాస్ బుక్ లేదా కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు
- జాతీయ జనాభా రిజిస్టరు జారీ చేసిన స్మార్ట్ కార్డ్, భారత్ పాస్ పోర్ట్, ఫొటోతో ఉన్న పింఛన్ పత్రం అయినా తీసుకెళ్లొచ్చు
- ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు
- దివ్యాంగుల గుర్తింపు కార్డ్, చట్ట సభలలో సభ్యత్వాన్ని చూపే అధికారిక గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డ్‌ను తీసుకొని పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేయవచ్చు.
ఓటేద్దాం - మంచి నాయకుడిని ఎన్నుకుందాం - ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం
ఎన్నిక ప్రచారం ముగిసింది - ప్రలోభాల పర్వం ప్రారంభమైంది