మేడ్చల్ జిల్లాలోని కాప్రా సర్కిల్ హౌసింగ్ బోర్డు డివిజన్ కృష్ణా నగర్లో మైసమ్మ, నల్ల పోచమ్మ ఆలయంలో నిర్మించిన రేకుల షెడ్‌ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు రాత్రికి రాత్రే కూల్చేశారని భక్తులు ధర్నాకు దిగారు. ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా షెడ్డును కూల్చేయడం దారుణమని కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారులు వచ్చి దీనికి సమాధానం చెప్పే వరకూ నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. కొత్త రేకుల షెడ్డు నిర్మించడం గానీ... ప్రత్యామ్నాయం గానీ చూపించాలని భక్తులు డిమాండ్ చేశారు.
ఆలయ రేకుల షెడ్డు కూల్చినందుకు భక్తుల ఆగ్రహం
మేడ్చల్ జిల్లాలోని కృష్ణానగర్‌లో మైసమ్మ, నల్లపోచమ్మ ఆలయంలో నిర్మించిన రేకుల షెడ్డును అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు సమస్య పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
రేకుల షెడ్డు