రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ విధిగా ప్రతి ఒక్కరూ పాటించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని మియాపూర్ అల్విన్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన సందర్శించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సజ్జనార్
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను అందరూ పాటించాలని కోరారు. హైదరాబాద్‌లోని మియాపూర్ అల్విన్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేశారు.
మియాపూర్ అల్విన్ కూడలి వద్ద తనిఖీలు చేపట్టిన సీపీ సజ్జనార్
చెక్‌పోస్టు వద్ద ప్రతి ఒక్క వాహనదారున్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపించి వేశారు. కొందరు నకిలీ గుర్తింపుకార్డులు ధరించి డెలివరీ బాయ్స్‌గా బయటకు వస్తున్నారని సీపీ తెలిపారు. అత్యవసర పనుల కోసం గుర్తింపుకార్డులు కలిగిన వారే బయటకు రావాలని.. అనవసరంగా తిరిగే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఉదయం నుంచి దుకాణాల వద్ద కిటకిట.. 10 తర్వాత స్తబ్ధత