తెలంగాణ

telangana

ETV Bharat / state

తుపాకీతో కాల్చుకుని సీఆర్ఫీఎఫ్​ కానిస్టేబుల్​ మృతి - medchal crime news

విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్​ జిల్లాలోని మల్కారం సీఆర్ఫీఎఫ్​ క్యాంపులో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్​ విఠల్​రావు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

crpf constable suicide
తుపాకీతో కాల్చుకుని సీఆర్ఫీఎఫ్​ కానిస్టేబుల్​ మృతి

By

Published : Mar 8, 2020, 6:13 PM IST

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్ ఠాణా పరిధి బాలాజీ నగర్​లోని మల్కారం సీఆర్ఫీఎఫ్​ క్యాంపులో కానిస్టేబుల్ అత్మహత్య చేసుకున్నాడు. మహరాష్ట్రకు చెందిన విఠల్​రావు మనువార్ సర్వీసు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెలవులపై వెళ్లి రెండు రోజుల క్రితం విధులకు హాజరయ్యాడు.

రాత్రి విధులకు వచ్చిన విఠల్ రావు ఆదివారం తెల్లవారుజామున తన సర్వీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న జవహర్​నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

తుపాకీతో కాల్చుకుని సీఆర్ఫీఎఫ్​ కానిస్టేబుల్​ మృతి

ఇదీ చూడండి:మాతా మాణికేశ్వరి ఇక లేరు.. భక్తుల సందర్శనార్ధం పార్ధివదేహం

ABOUT THE AUTHOR

...view details