దేశంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో మేడ్చల్ జిల్లా నిజాంపేట్‌లోని ఎస్ఎల్జీ ఆస్పత్రి నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
'క్యాన్సర్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' - మేడ్చల్ జిల్లా నిజాంపేట్
ప్రతి మనిషి తమ జీవన విధానంలో మంచి ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట్‌లోని ఓ ఆస్పత్రి నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'క్యాన్సర్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
సమాజంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఆస్పత్రి చేస్తున్న కృషిని సజ్జనార్ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు.