మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. 9 రోజుల క్రితం ఆయన అమెరికా నుంచి వచ్చాడు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆయనకు రెండు రోజులుగా జలుబుతో కూడిన జ్వరం వచ్చింది.
మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు
మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన అతను జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీన్ని అనుమానాస్పద కేసుగా పరిగణిస్తున్నట్లు ఏఎన్ఎం చంద్రకళ తెలిపారు.
corona suspect
ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చి... అతనే స్వయంగా అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు 108 వాహనంలో ఆయనతో పాటు ఆయన భార్యను సైతం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీన్ని అనుమానాస్పద కేసుగా పరిగణిస్తున్నట్లు ఏఎన్ఎం చంద్రకళ తెలిపారు.
ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'