రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాసులు ఆందోళనకు చెందుతున్నారు. ఇప్పటికే బోడుప్పల్ నగరపాలక సంస్థ తెరాస అధ్యక్షుడు చర్ల అంజనేయులు పాజిటివ్ సోకి మరణించారు. తాజాగా ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. వీరిలో రామంతపూర్ నెహ్రూ నగర్లో గతంలో కరోనా వైరస్ సోకిన కుటుంబంలోనే మరో ఇద్దరు చిన్నారులు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు పాత రామంతపూర్‌లో ఒకరు, ఉప్పల్ భరత్ నగర్లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో కరోనా కలకలం.. భయపడుతున్న ప్రజలు!
కరోనా పాజిటివ్ కేసుల కారణంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ తెరాస అధ్యక్షుడు చర్ల ఆంజనేయులు కొవిడ్ పాజిటివ్‌తో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్, రామంతపూర్‌లో కూడా ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మేడ్చల్ జిల్లాలో కరోనా కలకలం.. భయపడుతున్న ప్రజలు!
ఒక్క సోమవారం నాడే ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 26 మందికి రాపిడ్ పరీక్షలు నిర్వహించగా వీరిలో ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. జీహెచ్ఎంసీ, పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి చేస్తున్నారు.
ఇదీ చూడండి :పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు