మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెడ్లో నాలాలోపడి మృతి చెందిన బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. బాలిక సుమేధ ప్రమాదవశాత్తు మృతి చెందలేదని... అది ప్రభుత్వ హత్యేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అనంతరం సంఘటనా జరిగిన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే సుమేధ మృతిచెందిందని... బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు.
ముందే స్పందించి ఉంటే మా బిడ్డ దక్కేది