జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు పిల్లలతో కలిసి ప్రచారం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రచారం కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఏమీ తెలియని పిల్లలను వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో పిల్లలు... స్థానికుల ఆగ్రహం - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
బల్దియా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కడక్కడ కొందరు అభ్యర్థులు పిల్లలతో ప్రచారం చేస్తున్నారు. ఇది సరదా కోసం చేశారా? పిల్లలతో చేస్తే ప్రత్యేక ఆకర్షణ అనుకున్నారో కానీ స్థానికులు ఈ మాత్రం పిల్లల ప్రచారంపై మండిపడుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో పిల్లలు... స్థానికుల ఆగ్రహం
పిల్లలను చిన్నప్పటి నుంచే రాజకీయ ద్వేషాలకు అలవాటు చేసినట్లు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదా అని స్థానికులు ప్రశ్నించారు. చర్లపల్లి 3వ డివిజన్, మౌలాలి 138 డివిజన్లో పిల్లలతో ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:నీటి బిల్లులు మాఫీ అయితే మీటర్లు ఎందుకు?: ఎంపీ అర్వింద్