ఆడుకుంటానని ఇంట్లో తల్లికి చెప్పి వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పరిధిలోని వినాయక్ నగర్‌లో జరిగింది. బిహార్ రాష్ట్రానికి చెందిన జయ ప్రకాష్, పుష్పాదేవి భార్యభర్తలు కాగా వీరికి నలుగురు సంతానం. చిన్న కుమారుడైన అమిత్ కుమార్ (12) మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు తల్లి పుష్పాదేవికి చెప్పి ఆడుకుంటానని ఇంట్లో నుండి వెళ్లాడు.
ఆడుకుంటానని చెప్పి వెళ్లిన బాలుడు అదృశ్యం - boy missing in medchal district
ఆడుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఓ బాలుడు కనిపించకుండా పోయిన సంఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని వినాయక్ నగర్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆడుకుంటానని చెప్పి వెళ్లిన బాలుడు అదృశ్యం
రాత్రి తొమ్మిది గంటలైనా ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులందరు స్థానికంగా వెతికారు.. బంధువులను కూడా ఆరా తీయగా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఓ సారి అలాగే వెళ్లాడని కానీ వెంటనే వచ్చినట్లు సమాచారం.
ఇవీ చూడండి: ఘనంగా చింపాంజీ సుజీ జన్మదిన వేడుకలు