అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని పేట్ బషీరాబాద్ ఏసీపీ నర్సింహరావు అన్నారు. మేడ్చల్ పట్టణంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని ఏసీపీ సూచించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తం దొరకడం లేదని.. దాతలు ముందుకు వచ్చి తమ ఉదారతను చాటాలని కోరారు. రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. సుమారు 120 మంది యువకులు రక్తదానం చేశారని ఏసీపీ వెల్లడించారు.
తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం రక్తదాన కార్యక్రమం
మేడ్చల్ పట్టణంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 120 మంది యువకులు రక్తదానం చేశారని పేట్ బషీరాబాద్ ఏసీపీ నర్సింహరావు తెలిపారు.
తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం రక్తదాన కార్యక్రమం