మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో డెంగీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు మంత్రులు మందులు పంపిణీ చేశారు. వర్షాకాలంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆహార నియమాలు పాటించాలని... ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచొద్దని సూచించారు. జాగ్రత్తలు పాటించడం వల్లే దోమలు తగ్గుతాయని తెలిపారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం: మంత్రి ఈటల
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో డెంగీపై అవగాహన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి ఈటల పాల్గొన్నారు.
విద్యార్థులకు మందులు ఇస్తున్న మంత్రులు