తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటల కుమారుడి భూకబ్జా ఆరోపణలపై అధికారుల విచారణ షురూ

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డి భూకబ్జా ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు రావల్‌కోల్‌లోని సర్వే నెంబర్‌ 77లో గల భూములను పరిశీలించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.

నితిన్‌రెడ్డి భూకబ్జా ఆరోపణలపై విచారణ
నితిన్‌రెడ్డి భూకబ్జా ఆరోపణలపై విచారణ

By

Published : May 24, 2021, 5:31 PM IST

నితిన్‌రెడ్డి భూకబ్జా ఆరోపణలపై విచారణ

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమి కబ్జా చేశాడంటూ మేడ్చల్‌ జిల్లా రావల్‌కోల్‌కు చెందిన మహేశ్‌ చేసిన ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో మేడ్చల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మార్వో గీత ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ చేశారు. మహేశ్‌ ఫిర్యాదు మేరకు రావల్‌కోల్ గ్రామంలోని సర్వే నెంబర్‌ 77లోని 10 ఎకరాల 11 గుంటల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.

మరోవైపు ఫిర్యాదుదారుడు మహేశ్‌ను మేడ్చల్‌ తహశీల్దారు కార్యాలయంలో పలు అంశాలపై ప్రశ్నించారు. భూములకు సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని ఫిర్యాదుదారుడు తెలిపాడు.

ఇదీ చూడండి: కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details