తెలంగాణ

telangana

ETV Bharat / state

పేట్ బషీర్​బాద్​లో పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.85 స్వాధీనం - medchal district

మేడ్చల్ జిల్లా బాలానగర్ జోన్ పరిధిలోని పేకాట, బొమ్మబొరుసు ఆట ఆడుతున్న వారిపై ఎస్​ఓటీ పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.85 వేల నగదు స్వాధీనం చేసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.

పేట్ బషీర్​బాద్​లో పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.85 స్వాధీనం
పేట్ బషీర్​బాద్​లో పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.85 స్వాధీనం

By

Published : Sep 7, 2020, 12:06 AM IST

మేడ్చల్ జిల్లా బాలానగర్ జోన్ పరిధిలోని పేకాట, బొమ్మబొరుసు ఆట ఆడుతున్న వారిపై ఎస్​ఓటీ పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్​లోని ఏఎంఆర్ గార్డెన్స్​లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో బాలానగర్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు దాడి చేసి... ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.85 వేల నగదు స్వాధీనం చేసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.

13మంది అదుపులోకి..

మరోవైపు మేడ్చల్ పరిధిలోని శ్రీ రంగవరంలో బొమ్మబొరుసు ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని మేడ్చల్ పోలీస్ స్టేషన్​లో అప్పగించారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details