మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో శ్రీ విజ్ఞాన భారతి హైస్కూల్లో ఇంగ్లీష్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శామీర్‌పేట సీఐ ఎస్.సంతోషం ముఖ్య అతిథిగా విచ్చేసి పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన మోడల్ ఎయిర్ పోర్టును ప్రారంభించారు.
చిన్నారుల మోడల్ ఎయిర్ పోర్టు అద్భుతహా... - మేడ్చల్ జిల్లా
శ్రీ విజ్ఞాన భారతి పాఠశాలలో నిర్వహించిన ఇంగ్లీష్ఫేర్ కార్యక్రమం చూపరులను ఆకర్షించింది. మోడల్ ఎయిర్ పోర్టు నిర్మించి విమానాశ్రయంలోని వివిధ ప్రక్రియలను విద్యార్థులు కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు.
ఇంగ్లీష్ ఫేర్‌లో ఆకట్టుకున్న మోడల్ ఎయిర్పోర్ట్
విమానాశ్రయంలోకి వెళ్లి.. తిరిగి వచ్చే వరకు వివిధ ప్రక్రియలను విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఎయిర్ పోర్టులో సూపర్ మార్కెట్, హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. భారతదేశ సాంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్