మేడ్చల్ జిల్లా పేట్‌బషీర్‌బాద్ ఠాణాలో పెట్రో మొబైల్-1 కానిస్టేబుల్ రవీందర్‌పై వేటు పడింది. ఓ కేసు విషయంలో విచారణకు వెళ్లి బాధితుల నుంచి 500 రూపాయులు లంచం తీసుకున్న కారణంగా సైబర్‌బాద్ సీపీ... కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
అసలు ఏమి జరిగిందంటే...
ఓ కేసు విషయంలో ఈనెల 14న మహారాష్ట్ర నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని విచారించడానికి వెళ్లిన కానిస్టేబుల్ రవీందర్ బాధితుడిని డబ్బులు డిమాండ్ చేశాడు. 500 రూపాలయలు అడగగా... బాధితుడు 300 రూపాయలను రవీందర్ బావమరిది శ్రీకాంత్‌కు గూగుల్‌పే ద్వారా చెల్లించాడు. ఈ విషయాన్ని బాధితుడు ట్విట్టర్ ద్వారా డీజీపీ, సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టి కానిస్టేబుల్ రవీందర్‌ను సీపీ సజ్జనార్ సస్పెండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై మహేశ్... బాధితుడి వద్దకు వెళ్లి అతడు నిరుపేద అవడం వల్ల నిత్యవసర సరకులు అందించి కొంత నగదు ఇచ్చారు.
ఇదీ చూడండి :ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..!